దినవృత్తాంతములు రెండవ గ్రంథము 1 : 1 (TEV)
దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడ ఉండి అతనిని బహు ఘనుడైన రాజునుగా చేసెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 1 : 2 (TEV)
యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోనునందుండెను గనుక
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 1 : 3 (TEV)
సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇశ్రాయేలీయుల పితరుల యిండ్లకు పెద్దలైనవారి కందరికిని, అనగా ఇశ్రాయేలీయులకందరికిని ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరును
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 1 : 4 (TEV)
సొలొమోనుతో కూడ కలసి గిబియోనునందుండు బలిపీఠము నొద్దకు పోయిరి; దావీదు దేవుని మందసమును కిర్యత్యారీమునుండి తెప్పించి యెరూషలేమునందు దానికొరకు గుడారమువేసి తాను సిద్ధపరచిన స్థలమున నుంచెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 1 : 5 (TEV)
హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన యిత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాసస్థలము ఎదుట ఉండగా సొలొమోనును సమాజపువారును దానియొద్ద విచారణ చేసిరి.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 1 : 6 (TEV)
సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధినుండి ఇత్తడి బలిపీఠము నొద్దకు సొలొమోను పోయి దానిమీద వెయ్యి దహనబలులను అర్పించెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 1 : 7 (TEV)
ఆ రాత్రియందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమైనేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాని అడుగుమని సెలవియ్యగా
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 1 : 8 (TEV)
సొలొమోను దేవునితో ఈలాగు మనవిచేసెనునీవు నా తండ్రియైన దావీదుయెడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి యున్నావు గనుక
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 1 : 9 (TEV)
దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము; నేల ధూళియంత విస్తారమైన జనులమీద నీవు నన్ను రాజుగా నియమించియున్నావు
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 1 : 10 (TEV)
ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తిగలవాడెవడు? నేను ఈ జనులమధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 1 : 11 (TEV)
అందుకు దేవుడు సొలొమోనుతో ఈలాగు సెలవిచ్చెనునీవు ఈ ప్రకారము యోచించు కొని, ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారిమీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి యున్నావు.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 1 : 12 (TEV)
కాబట్టి జ్ఞానమును తెలివియు నీ కియ్య బడును, నీకన్న ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను అని చెప్పెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 1 : 13 (TEV)
పిమ్మట సొలొమోను గిబియోనులోనుండు సమాజపు గుడారము ఎదుటనున్న బలిపీఠమును విడచి యెరూషలేమునకు వచ్చి ఇశ్రాయేలీ యులను ఏలుచుండెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 1 : 14 (TEV)
సొలొమోను రథములను గుఱ్ఱపు రౌతులను సమ కూర్చెను, వెయ్యిన్ని నాలుగువందలు రథములును పండ్రెండు వేల గుఱ్ఱపు రౌతులును అతనికి ఉండెను; వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణములలో ఉంచెను, కొందరిని తన రాజసన్నిధిని ఉండుటకు యెరూషలేములో ఉంచెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 1 : 15 (TEV)
రాజు యెరూషలేమునందు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను, సరళ మ్రానులను షెఫేల ప్రదేశముననున్న మేడిచెట్లంత విస్తారముగాను సమకూర్చెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 1 : 16 (TEV)
సొలొమోనునకుండు గుఱ్ఱములు ఐగుప్తులోనుండి తేబడెను, రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధర నిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 1 : 17 (TEV)
వారు ఐగుప్తునుండి కొని తెచ్చిన రథమొకటింటికి ఆరువందల తులముల వెండియు గుఱ్ఱమొకటింటికి నూటఏబది తులముల వెండియు నిచ్చిరి; హిత్తీయుల రాజులందరికొరకును సిరియా రాజులకొరకును వారు ఆ ధరకే వాటిని తీసికొనిరి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

BG:

Opacity:

Color:


Size:


Font: